మొత్తానికి ఎన్నో ఏళ్ళ నుండి ఫ్యాన్స్ కు మంచి సినిమా ఇవ్వాలని చూస్తున్న తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ కోరిక ‘దర్బార్’ తో తీరింది. ‘దర్బార్’ సినిమాలో. అప్పుడెప్పుడో ముత్తు, అరుణాచలం, నరసింహ ఈ సినిమాల్లో రజినీ స్టైల్ ను ఎవరూ మర్చిపోరు. అయితే ఆ రేంజ్ లో కామెడీ, స్టైల్, మ్యానరిజమ్స్ ను అభిమానులు చూసి చాలా కాలం అయింది. అలాంటి నిరాశలో ఉన్న అభిమానులకు ‘దర్బార్’ మంచి రిలీఫ్ ఇచ్చింది. ఏడుపదుల వయసులో వున్నా సినిమాలో మాత్రం రజనీ నాలుగు పదులు దాటిన యువకుడి తరహాలో మెరుపు వేగంతో నటించిన తీరుకు రజనీ అభిమానులు ఆనందంతో పండగా చేసుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తుంది. నిన్న రిలీజ్ అయిందో లేదో అప్పుడే వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయినట్టు తెలుస్తుంది. పండగ సీజన్ కావడంతో ఈ వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఒక్కరోజులోనే 100 కొట్ల క్లబ్ లో చేరడం అంటే మాములు విషయం కాదు..
కాగా మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘దర్బార్’. 2లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు. దర్బార్ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను NV ప్రసాద్, UV వంశీ రిలీజ్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: