పిశాచి, డిటెక్టివ్ వంటి డబ్బింగ్ మూవీస్ ద్వారా తమిళ దర్శకుడు మిస్కిన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఇప్పుడు మిస్కిన్ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ని రూపొందించారు. డబల్ మీనింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఉదయా నిధి స్టాలిన్ హీరో గా మిస్కిన్ దర్శకత్వంలో రూపొందిన “సైకో” మూవీ జనవరి 24వ తేదీ రిలీజ్ కానుంది. అదితి రావు హైదరి, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలలో నటించగా రామ్ , షాజి చెన్ , సింగంపులి, నరేన్, రేణుక ముఖ్య పాత్రలలో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
అరుణ్ మొళి మాణిక్కమ్ సమర్పణలో రూపొందిన “సైకో” మూవీ కి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయ రాజా సంగీతం అందించారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు పి .సి . శ్రీరామ్ శిష్యుడు తన్వీర్ మీర్ ఈ మూవీ కి ఛాయాగ్రాహకుడి గా పనిచేశారు. హీరో ఉదయా నిధి స్టాలిన్ తో ఫస్ట్ టైమ్, దర్శకుడు మిస్కిన్ తో మూడవసారి ఇళయరాజా పనిచేశారు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం చేతుల మీదుగా రిలీజయిన “సైకో” మూవీ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: