త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో’. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ ‘సామజవరగమనా’, ‘రాములో రాములా’ ‘ఓ మై గాడ్ డాడీ’ పాటలు రిలీజ్ చేయగా అభిమానులను అలరిస్తున్నాయి. రీసెంట్ గా బుట్ట బొమ్మ సాంగ్ ను కూడా రిలీజ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని… సినిమా రిలీజ్ వరకూ ఈ సినిమానుండి ఎగ్జైటింగ్ అప్ డేట్స్ ఇస్తుంటామని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
It’s a WRAP!! We are glad to announce that #AlaVaikuntapurramuloo shoot is complete & we will bring you all the exciting updates till the release date. Be Ready for the Biggest Sankranthi Celebration in Theatres, Only!! #AVPLFromJan12th @alluarjun #Trivikram @hegdepooja pic.twitter.com/ogqRJ3cXKY
— Haarika & Hassine Creations (@haarikahassine) December 28, 2019
కాగా ఈ సినిమాలో మరోసారి పూజా హెగ్డే బన్నీతో జతకట్టనుంది. ఇంకా ఈ సినిమాలో టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 2020 సంక్రాంతికి జనవరి 12వ రిలీజ్ చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: