ప్రతీ సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా కొన్ని జంటలు మరోసారి మురిపించే ప్రయత్నం చేశాయి. ఆ జోడీల వివరాల్లోకి వెళితే…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలకృష్ణ – సోనాల్ చౌహాన్:
అచ్చొచ్చిన కథానాయికలతో మళ్ళీ మళ్ళీ జట్టుకట్టడం నటసింహ బాలకృష్ణకి కొత్తేమీ కాదు. ఈ క్రమంలోనే… తన లక్కీ హీరోయిన్స్ లో ఒకరైన సోనాల్ చౌహాన్ తో ఈ సంవత్సరం ముచ్చటగా మూడోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారాయన. బ్లాక్ బస్టర్ మూవీ ‘లెజెండ్’ కోసం సోనాల్ తో తొలిసారి జోడీకట్టిన బాలయ్య… ఆ మధ్య ‘డిక్టేటర్’లోనూ సందడి చేశారు. ఇక తాజాగా విడుదలైన ‘రూలర్’లోనూ ఈ జంట మురిపించింది.
నాగ చైతన్య – సమంత:
ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ నాగచైతన్య, సమంతది సూపర్ హిట్ జోడీ. ‘ఏమాయ చేశావె’ కోసం మొదటి సారి జట్టుకట్టిన ఈ లవబుల్ పెయిర్… ఆ తరువాత ‘మనం’, ‘ఆటోనగర్ సూర్య’లోనూ మెస్మరైజ్ చేసింది. రెండేళ్ళ క్రితం వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఈ క్యూట్ కపుల్… ఈ సంవత్సరం వేసవిలో వచ్చిన ‘మజిలీ’ కోసం నాలుగోసారి కలసి నటించి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇందులో… నిజజీవిత పాత్రల్లోనే అంటే భార్యాభర్తలుగానే కనిపించి సిల్వర్ స్క్రీన్ పై సెన్సేషన్ క్రియేట్ చేశారు చే, సామ్.
సాయి తేజ్ – రాశి ఖన్నా:
మూడేళ్ళ క్రితం ‘సుప్రీమ్’లో జంటగా కనువిందు చేసిన సాయితేజ్, రాశి ఖన్నా… తాజాగా విడుదలైన ‘ప్రతి రోజూ పండగే’ కోసం మరోసారి కలసి నటించారు. రెండో ప్రయత్నంలోనూ విజయాన్ని ఒడిసి పట్టుకున్నారు.
వరుణ్ తేజ్ – పూజా హెగ్డే:
తన తొలి చిత్రం ‘ముకుంద’లో నాయికగా నటించిన పూజా హెగ్డేతోనే… ‘గద్దలకొండ గణేష్’ కోసం ఇంకోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసాడు వరుణ్ తేజ్. రెండో ప్రయత్నంలో ఈ జోడికి మంచి విజయం దక్కింది.
విజయ్ దేవరకొండ – రష్మిక:
గత ఏడాది ‘గీత గోవిందం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ జోడి అనిపించుకున్న విజయ్
దేవరకొండ, రష్మిక… ఈ సంవత్సరం ‘డియర్ కామ్రేడ్’తో పలకరించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా… విజయ్, రష్మిక జోడి మాత్రం మరోసారి మురిపించింది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – కాజల్ అగర్వాల్:
పోయినేడాది ‘కవచం’లో జంటగా నటించిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ అగర్వాల్… ఈ ఏడాది ‘సీత’ కోసం మరోసారి జోడీకట్టారు. రెండోసారి కూడా ఈ జంటకి పాజిటివ్ రిజల్ట్ దక్కలేదు.
గోపీచంద్ – మెహరీన్:
నిరుడు ‘పంతం’ కోసం ఆడిపాడిన గోపీచంద్, మెహరీన్… ఈ సంవత్సరం ‘చాణక్య’లో సెకండ్ టైమ్ సందడి చేశారు. ఈ జోడీకి ఈసారి కూడా నిరాశే మిగిలింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: