అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, ఆదిత్య వర్మ – ముగ్గురిలో మీరు మెచ్చిన హీరో..?

Which Hero Impressed You The Most?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Arjun Reddy Movie Hero,Kabir Singh Movie Hero,Adithya Varma Movie Hero,Vijay Deverakonda,Shahid Kapoor,Dhruv Vikram

ఈ రోజుల్లో ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడియన్స్ మైండ్ సెట్ ను దృష్టిలో పెట్టుకొని మంచి కథలను తీస్తే తప్ప ప్రేక్షకుడికి నచ్చట్లేదు. ఎంత బడ్జెట్ అన్నది చూసే రోజులు పోయాయి.. ఎంత కంటెంట్ వుంది అన్నది మాత్రమే చూస్తున్నారు. ఇక ఒక భాషలో హిట్ అవ్వడమే కష్టం అనుకుంటే.. ఒక సినిమా మాత్రం మూడు భాషల్లో హిట్ కొట్టింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో వెలిగే ఉంటుంది కదా. అదే ‘అర్జున్ రెడ్డి’.

సందీప్ రెడ్డి డైరెక్టర్ గా విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలనం విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ జనరేషన్ లో ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. రౌడీ బాయ్ విజయ్ దేవర‌కొండను స్టార్ హీరోను చేసిన సినిమా ‘అర్జున్ రెడ్డి. ఇక తెలుగులో సంచలన విజయం సాధించిన ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన ఆ సినిమా సంచలన విజయం సాధించింది. అంతేకాదు షాహిద్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఇది.

ఇప్పుడు బాలీవుడ్‌ నుండి కోలీవుడ్‌లో కూడా అర్జున్‌ రెడ్డి సక్సెస్‌ను దక్కించుకుంది. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి చాలా ఇబ్బందులే ఎదుర్కొంది. ఫస్ట్ ద గ్రేట్ డైరెక్టర్ బాలా దర్శకత్వం వహించారు. అయితే అది అవుట్ పుట్ సరిగా రాలేదని మళ్ళీ రీ షూట్ చేశారు. రిలీజ్.. రెండు మూడు సార్లు రిలీజ్ డేట్ లు వాయిదా పడ్డాయి. ఇలా చాలా కష్టాలు అర్జున్‌ రెడ్డి సినిమా ‘ఆధిత్య వర్మ’ ఎట్టకేలకు విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నిజానికి విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్ ను చూసిన తర్వాత ధృవ్ ఎలా చేస్తాడా అనుకున్నారు.. కానీ కుర్ర హీరో బాగానే చేసి మార్కులు కొట్టేసాడు.ఈ సినిమా మంచి బ్రేక్‌ను ఇచ్చింది. మొదటి సినిమతోనే అతడు సూపర్‌ హిట్‌ను దక్కించుకోవడంతో అంతా కూడా అతడికి మంచి భవిష్యతు ఉంది అంటున్నారు.

మరి ఒక సినిమా మాతృకలో హిట్ అయినా.. రీమేక్ లో ఆడకపోవచ్చు.. అలా చాలా సినిమాలు చూసాం.. కానీ విడుదలైన మూడు భాషల్లో హిట్ కొట్టడం అంటే మాములు విషయం కాదు. ఆ క్రెడిట్ మాత్రం అర్జున్ రెడ్డికే దక్కింది. మరి ఈ మూడు సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా… వీరి ముగ్గురిలో ఎవరు బాగా నటించారు అన్న విషయాన్ని మీ ఓట్ ద్వారా తెలపండి.

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, ఆదిత్య వర్మ - ముగ్గురిలో మీరు మెచ్చిన హీరో..?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here