భారీ బడ్జెట్ మూవీస్ లో త్రిష

Star Actress Trisha Roped In For Big Budget Movies

17 సంవత్సరాలుగా టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను తన అందం, అభినయం తో ఆకట్టుకున్న త్రిష నటించిన” 96″ మూవీ ఘనవిజయంతో పలు భారీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు అందుకొంటున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో ఒక మలయాళ మూవీ, మెగా స్టార్ చిరంజీవి 152 మూవీ లో హీరోయిన్ గా త్రిష ఎంపిక అయ్యారని సమాచారం. ఇప్పుడు మరో భారీ తమిళ మూవీ లో త్రిష ఎంపికయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం లో రాజ రాజ చోళన్ జీవిత చరిత్ర ఆధారంగా పీరియాడిక్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్ ” మూవీ రూపొందనుంది. విక్రమ్, జయం రవి, ఐశ్వర్య రాయ్ , కీర్తి సురేష్, అనుష్క, కార్తీ, విజయ్ సేతుపతి, మోహన్ బాబు ప్రధాన తారాగణంగా రూపొందనున్న ఈ మూవీ లో త్రిష ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా రూపొందనున్న ఈ మూవీ కి
కల్కి కృష్ణమూర్తి నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారం. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న “పొన్నియిన్ సెల్వన్ ” మూవీ షూటింగ్ డిసెంబర్ 2వ వారంలో థాయ్ ల్యాండ్ లో ప్రారంభం కానుంది. ఈ మూవీ తమిళం తోపాటు తెలుగు, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + twenty =