డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ కథానాయకులుగా రూపొందుతున్న RRR మూవీ 2020 సంవత్సరం జులై 30 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, నటుడు,దర్శకుడు సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
RRR మూవీషూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్, ఒలీవియా జంటపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఈ రొమాంటిక్ సన్నివేశాలు RRR మూవీ కి హై లైట్ కానున్నాయని సమాచారం. సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో ఎన్టీఆర్ ట్రైబల్ హీరో కొమరం భీమ్, రామ్ చరణ్ ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు.
బ్లాక్ బస్టర్ మూవీ “బాహుబలి “తరువాత రాజమౌళి దర్శకత్వం లో ఇద్దరు స్టార్ హీరోలతో రూపొందుతున్న RRR మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: