మరోసారి తన టైటిల్ తోనే దుమారం రేపుతూ.. రెండు వర్గాల పేర్లనే టైటిల్ గా తీసుకొని ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అన్న సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతోనే సినిమాకు సగం క్రేజ్ తీసుకొచ్చేసాడు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలను రిలీజ్ చేసి… డైరెక్ట్ గా పలు రాజకీయ నేతలపైనే సెటైర్లు వేసాడు. రీసెంట్ గా ఈ సినిమా నుండి ‘పప్పు లాంటి అబ్బాయి’ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసి మరో షాకిచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈ సినిమాతో షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న వర్మ తాజాగా మరో షాకిచ్చాడు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాకు సీక్వెల్ తీయాలనే ఆలోచన వచ్చిందని చెప్పాడు. టీడీపీకి గుడ్ బై చెప్పిన వల్లభనేని వంశీ ఫైర్ అవుతున్న ఇంటర్వ్యూలు చూసిన తర్వాత తనకు ఈ ఐడియా వచ్చిందని..ఈ సీక్వెల్ కు ‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్’ అనే టైటిల్ పెడతానని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. మొత్తానికి వర్మ ప్రస్తుత రాజకీయాలతో బాగానే ఆడుకుంటున్నాడు.
After seeing the fiery Vallabhaneni Vamsi’s interviews, I got an idea for a sequel to KAMMA RAJYAMLO KADAPA REDDLU …it is going to be titled REDDY RAJYANIKI KAMMA FANS #KRKR
— Ram Gopal Varma (@RGVzoomin) November 16, 2019
కాగా ఈ సినిమాలో చంద్రబాబు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పవన్ కళ్యాణ్, కేఏ పాల్‌లను పోలిన నటులు నటిస్తుండగా.. జగన్ పాత్రలో రంగం ఫేం అజ్మల్ అమీర్, అలీ, బ్రహ్మానందం నటిస్తున్నారు. అజయ్ మైసూర్ సమర్పణ లో టైగర్ కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో ఈ సినిమాను విడుదల చేసే యోచనలో ఉన్నాడు వర్మ.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.