త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో ‘అల వైకుంఠపురములో’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో… ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరో పక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్స్ ను.. పాటలను రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా’, ‘రాములో రాములా’ పాటలను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా తర్వాత బన్నీ సుకుమార్ తో చేయనున్న సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలో ఈ సినిమాను త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతోనే తెరకెక్కబోతుందని తెలుస్తోంది. గతంలో కూడా సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ చిత్రాలను కూడా రివెంజ్ ఫార్ములాతోనే తీశారు. ఇప్పుడు బన్నీతో చేయబోయే సినిమా కూడా రివెంజ్ ఫార్ములాతోనే తీయబోతున్నాడట. కాగా ఈ కథ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండటంతో.. ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ చాలా రఫ్ గా ఉంటుందని.. అలాగే బన్నీ లుక్ కూడా చాల కొత్తగా ఉండబోతుందట. మరి చూద్దాం చరణ్ తో రంగస్థలం సినిమాతో హిట్ కొట్టిన సుకుమార్.. ఇప్పుడు బన్నీ తో హిట్ కొడతాడేమో..!
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: