అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఒకపక్క షూటింగ్ ను జరువుకుంటూనే, మరోపక్క ప్రమోషన్స్ పనులను కూడా వేగవంతం చేసింది. కాగా తాజాగా ఈ చిత్రం నుండి చిత్రబృందం ఆసక్తికరమైన అప్ డేట్ ఇచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ లోడింగ్ అవుతుందని.. టీజర్ అతి త్వరలోనే మీ ముందుకు రాబోతుందని సోషల్ మీడియా ద్వారా చిత్రయూనిట్ తెలిజేశారు.
TEASER LOADING 💥💥#SarileruNeekevvaru
Super Star @urstrulyMahesh @vijayashanthi_m @iamRashmika @RathnaveluDop @AnilSunkara1 @ThisIsDSP @AKentsOfficial @SVC_official @GMBents pic.twitter.com/6FaJTKzeJD
— Anil Ravipudi (@AnilRavipudi) November 16, 2019
కాగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలచేయనున్నారు. ఇక మహేష్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: