‘ఊపిరి’… ‘కింగ్’ నాగార్జున కెరీర్‌లో ప్రత్యేకంగా నిలచిన చిత్రం. అటువంటి సినిమాకి రచయితగా పనిచేసిన అహిసోర్ సోల్‌మన్ డైరెక్షన్‌లో నాగ్ ఓ చిత్రం చేయబోతున్నట్లు టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… 2013లో వచ్చిన హిందీ ఫిల్మ్ ‘జాన్ డే’ కోసం తొలిసారి మెగాఫోన్ పట్టుకున్నాడు అహిసోర్ సోల్‌మన్. అనంతరం ‘ఊపిరి’, ‘మహర్షి’ వంటి తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసిన ఈ టాలెంటెడ్ రైటర్… ఇప్పుడు తెలుగులోనూ మెగాఫోన్ పట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే… ఓ కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీని నాగ్‌కు వినిపించడం జరిగిందట. నాగ్‌కు కూడా ఆ కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఇందులో నాగ్ కథానాయకుడిగా కాకుండా ప్రధాన పాత్రలో (‘గగనం’, ‘రాజన్న’ తరహాలో) దర్శనమివ్వనున్నట్టు తెలుస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: