ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు కాకుండా తను చేసే ప్రతి సినిమాలో ఓ ప్రత్యేకత ఉండేలా.. విభిన్నంగా ఉండేలా చూసుకుంటుంది అనుష్క. అలా ఆలోచిస్తుంది కాబట్టే అరుంధతి, సైజ్ జీరో, బాహుబలి సిరీస్, భాగమతి లాంటి సినిమాలు తీసి అందరి ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి మరో ప్రయోగం చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నిశ్శబ్దం మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా టీజర్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా టైటిల్ కు తగ్గట్టే టైటిల్ ను కూడా చాలా సైలెంట్ గానే కట్ చేశారు. అయితే ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆద్యంతం ఆకట్టుకునే సస్పెన్స్ మరియు థ్రిల్లింగ్ ఘటనలతో సాగిన ఈ టీజర్, సినిమాపై విపరీతంగా అంచనాలు పెంచేసింది. వండర్ ఫుల్ విజువల్స్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు, హాంటింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సాగిన ఈ టీజర్, ప్రస్తుతం మంచి వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది.
ముఖ్యంగా అనుష్క గురించి చెప్పాలి. డిఫరెంట్ లుక్ లో సన్నపడిన అనుష్క చాలా క్యూట్ గా వుంది. అంతేకాదు.. ఈ సినిమాలో తాను దివ్యంగురాలి పాత్రలో నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఈ సినిమా కోసం తాను స్పెషల్ గా సైన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంది. టీజర్ చూస్తే తను ఎంత కష్టపడి నేర్చుకుందో అర్ధమవుతుంది. తప్పకుండా అనుష్క కెరీర్ లో ఈ పాత్ర తనకు బెస్ట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు.
తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు లో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: