స్టెత్ పట్టే ఓ డాక్టర్… తన కూతురుకి జరిగిన అన్యాయానికి కత్తి పట్టి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం `సర్పయాగం`. నటభూషణ్ శోభన్‌బాబు, రోజా తండ్రీకూతుళ్ళుగా నటించిన ఈ రివెంజ్ స్టోరీకి ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రంలో వాణీ విశ్వనాధ్, శ్రీనివాస్ వర్మ, బ్రహ్మానందం, రఘునాథరెడ్డి, రేఖ, జయలలిత, సాయికుమార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. విద్యాసాగర్ స్వరసారథ్యంలో రూపొందిన పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. “దిగు దిగు దిగు నాగ”, “ఏబీసీడి గుండెలో ఏదో వేడి”, “చుక్కా చుక్కా కన్నీటి చుక్క” వంటి గీతాలు ప్రేక్షకులను అలరించాయి. 1991 నవంబర్ 1న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘సర్పయాగం’… నేటితో 28 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.