స్నేహం గొప్పతనాన్ని చాటిచెప్పిన ‘నీ స్నేహం’కు 17 ఏళ్ళు

Uday Kiran Nee Sneham Movie Completes 17 Years,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Nee Sneham Movie Completes 17 Years,17 Years for Nee Sneham Movie,Uday Kiran Nee Sneham Telugu Movie

“కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట, రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం… రూపు రేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం” అంటూ స్నేహం గొప్పతనాన్ని చాటిచెప్పిన చిత్రం ‘నీ స్నేహం’. ఉదయ్ కిరణ్, జతిన్ ప్రాణ స్నేహితులుగా నటించగా… ఆర్తి అగర్వాల్ కథానాయికగా కనిపించింది. “కళాతపస్వి” కె.విశ్వనాథ్, గిరిబాబు, సుదీప, అజయ్, అలీ, శివాజీరాజా, హేమ, సుధ, సంగీత తదితరులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో దర్శనమిచ్చారు. ఈ చిత్రాన్ని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎస్.రాజు నిర్మించగా… పరుచూరి మురళి తెరకెక్కించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన పాటలకు… ఆర్.పి.పట్నాయక్ ఆకట్టుకునే బాణీలు సమకూర్చారు. “కొంతకాలం కిందట”, “వేయికన్నులతో”, “ఇలా చూడు”, “చినుకు తడికి”, “ఏమో అవునేమో”, “ఊరుకో హృదయమా”… ఇలా ప్రతీ పాట ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాను బెంగాలీలో ‘ప్రేమి’ పేరుతో పునర్నిర్మించడం విశేషం. 2002 నవంబర్ 1న విడుదలై విజయం సాధించిన ‘నీ స్నేహం’… నేటితో 17 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − five =