యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న పేట్రియాటిక్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’. ఇందులో కొమరం భీమ్‌గా యంగ్ టైగర్ యన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శనమివ్వనున్నారు. ఇదిలా ఉంటే… ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేమిటంటే… కొమరం భీమ్, అల్లూరి పాత్రలు సాగించే పోరాటాన్ని సరైన దిశలో నడిపించే మార్గదర్శి పాత్రలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కనిపించనున్నాడట. అంతేకాదు.. అజయ్ పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని సమాచారం.
కాగా… దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం… 2020 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: