నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా ‘ఎంత మంచివాడవురా’ పేరుతో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘శతమానంభవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఇటీవల రాజమండ్రి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్… ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో కళ్యాణ్ రామ్, మెహరీన్, రాజీవ్ కనకాల, పవిత్రా లోకేష్‌పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. కాగా… ఈ నెల 22 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని తెలిసింది.
గోపిసుందర్ సంగీతసారథ్యంలో రూపొందుతున్న ‘ఎంత మంచివాడవురా’… 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























