వినాయక్ తో సినిమాకు వెంకీ గ్రీన్ సిగ్నల్..?

VV Vinayak to Direct Venkatesh Again,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Director VV Vinayak Next With Venkatesh,VV Vinayak Upcoming Movie with Victory Venkatesh,Venkatesh Latest Movie News 2019

ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన ఒకప్పటి స్టార్ డైరెక్టర్ వినాయక్ ఇప్పుడు వరుస ప్లాప్స్ తో కాస్త వెనుకపడ్డాడు. ఇక ఇప్పుడు డైరెక్షన్ కు కాస్త గ్యాప్ ఇచ్చి హీరోగా ప్రయత్నించనున్నాడు. ‘శరభ’ ఫేమ్ ఎన్. నరసింహా దర్శకత్వంలో.. వివి వినాయక్ హీరోగా ‘సీనయ్య’ అనే సినిమాలో చేస్తున్నాడు. ఇక వినాయక్ పుట్టినరోజు సందర్భంగా ఈ బుధవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో సీనయ్య షూటింగ్‌‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమానుని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా వినాయక్ తో వెంకీ మూవీ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల ఆయన ఒక మంచి కథను సిద్ధం చేసుకుని వెంకటేశ్ కి వినిపించగా వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ప్రస్తుతం వెంకీ తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి ‘వెంకీమామ’ సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ తో సినిమాకి వెంకటేశ్ సిద్ధమవుతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తికాగానే, ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారని సమాచారం. మరి దీనిపై ఓ క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 16 =