‘విక్టరీ’ వెంకటేష్ కథానాయకుడిగా తన హోమ్ బేనర్ సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘జయం మనదేరా!’ ఒకటి. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వెంకటేష్ డ్యూయల్ రోల్స్‌లో దర్శనమిచ్చారు. వెంకీకి జోడీగా సౌందర్య, భానుప్రియ నటించగా… జయప్రకాష్ రెడ్డి, అతుల్ కులకర్ణి, బ్రహ్మానందం, అలీ, ‘ఆహుతి’ ప్రసాద్, ఎం.ఎస్.నారాయణ, ఎల్.బి.శ్రీరామ్, ఝాన్సీ, వెన్నిరాడై నిర్మల, హేమ, ప్రియ, రమాప్రభ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎన్.శంకర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను… తమిళంలో ‘మణికంఠ’ పేరుతో పునర్నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వేటూరి సుందరరామమూర్తి, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, చంద్రబోస్, కాలేకూరి ప్రసాద్ గీత రచన చేయగా… ‘వందేమాతరం’ శ్రీనివాస్ స్వరాలు సమకూర్చారు. “మెరిసేటి జాబిలి నువ్వే”, “హ్యాపీగా జాలీగా”, “హిందూస్తాన్‌లో”, “పెళ్ళికి బాజా”, “ఓ చూపుకే”, “చిన్ని చిన్ని”, “డోంట్ మిస్” … ఇలా అన్ని పాటలు ప్రేక్షకులను అలరించాయి. 2000 అక్టోబర్ 7న విడుదలై విజయం సాధించిన ‘జయం మనదేరా!’… నేటితో 19 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: