యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. పేట్రియాటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కొమరం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్నారు. ఇదిలా ఉంటే… `ఆర్ ఆర్ ఆర్` టైటిల్ కి సంబంధించి అబ్రివేషన్ సజెషన్స్ పంపమని ఇప్పటికే జక్కన్న ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనకి స్పందనగా వందలాది అబ్రివేషన్ సజెషన్స్ వచ్చాయట. అయితే, వీటిలో రెండు అబ్రివేషన్స్‌ని మేకర్స్ ఫిక్స్ చేశారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు వెర్షన్‌కు ‘రామ రౌద్ర రుషితం’ అనే అబ్రివేషన్ ను… నాన్ – తెలుగు వెర్షన్స్‌కు ‘రైజ్ రివోల్ట్ రివెంజ్’ అనే అబ్రివేషన్ ను ఫిక్స్ చేసినట్టు టాక్. త్వరలోనే ఈ టైటిల్ అబ్రివేషన్స్‌పై క్లారిటీ వస్తుంది. కాగా… డీవీవీ దానయ్య నిర్మిస్తున్న `ఆర్ ఆర్ ఆర్`… 2020 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: