‘బాహుబలి’ సిరీస్‌తో జాతీయ స్థాయిలో ఎనలేని గుర్తింపుని పొందాడు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. ప్రస్తుతం ఈ విజనరీ డైరెక్టర్ ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రీకరణలో తలమునకలై ఉన్నాడు. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీలో కొమరం భీమ్‌గా తారక్… అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే… ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్తొకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేమిటంటే… సాధారణంగా రాజమౌళి డైరెక్టోరియల్స్ నిడివి మూడు గంటలకు అటుఇటుగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ‘మర్యాదరామన్న’ ‘ఈగ’ మినహా దాదాపు జక్కన్న చిత్రాలన్నీ లెంగ్తీ రన్‌టైమ్‌తో నడుస్తుంటాయి. కాగా… ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్ర నిడివి కూడా కొంత తక్కువగా ఉండబోతున్నట్టు సమాచారం. కేవలం రెండున్నర గంటల్లో సినిమాను ముగించే విధంగా, క్రిస్పీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట దర్శకధీరుడు. ప్రస్తుతం భారీ చిత్రాలన్నీ “మూడు గంటల సమయం” అనే ట్రెండ్‌ను ఫాలో అవుతుంటే… రాజమౌళి మాత్రం దానికి విరుధ్ధంగా వెళ్తుండడం ఒకింత విస్మయానికి గురి చేసే విషయమే. మరి… ఈ కథనాల్లో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి ఉండాల్సిందే.
కాగా… దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ పేట్రియాటిక్ డ్రామా… 2020 జూలై 30న రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: