90ల్లో హిందీనాట అగ్రశ్రేణి కథానాయకుడిగా వెలుగొందాడు అనిల్ కపూర్. ఇక అనిల్ నట వారసురాలిగా తెరంగేట్రం చేసిన సోనమ్ కపూర్ కూడా బాలీవుడ్‌లో తనదైన ముద్రవేసింది. దాదాపు పుష్కరకాలంగా నాయికగా రాణిస్తున్న సోనమ్… ఈ శుక్రవారం `ద జోయా ఫ్యాక్టర్` సినిమాతో భారతీయ ప్రేక్షకులను పలకరిస్తోంది. ఇందులో దక్షిణాది కథానాయకుడు దుల్కర్ సల్మాన్‌తో జోడీ కట్టింది సోనమ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఇదివరకు `రాన్‌ఝానా` (2013) కోసం సౌత్ స్టార్ ధనుష్‌తో జతకట్టి కమర్షియల్ సక్సెస్‌ని చూసింది సోనమ్. కట్ చేస్తే… మళ్ళీ ఆరేళ్ళ తరువాత ఇప్పుడు `ద జోయా ఫ్యాక్టర్` కోసం మరో దక్షిణాది కథానాయకుడు దుల్కర్‌తో జట్టుకట్టింది. మరి… ఈ సౌత్ ఫ్యాక్టర్ `జోయా ఫ్యాక్టర్`కి కూడా కలిసొచ్చి… సోనమ్ ఖాతాలో మరో మెమరబుల్ హిట్ పడుతుందేమో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: