మెగాస్టార్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘స్టాలిన్’కు 13 ఏళ్ళు

Megastar Chiranjeevi Stalin Movie Completes 13 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Stalin Movie Updates,Stalin Telugu Movie Latest News,Stalin Movie Completed 13 Years,13 Years For Megastar Chiranjeevi Stalin Movie,13 Years Completed For Chiranjeevi Stalin Telugu Movie,#Stalin

“అన్నీ ఉండి… సాయం చేయాలనే మనసులేని వాళ్ళే నిజమైన అవిటివాళ్ళు” అనే సందేశాత్మ‌క అంశంతో తెర‌కెక్కిన‌ చిత్రం ‘స్టాలిన్’. మెగాస్టార్ చిరంజీవి, బ్రిలియంట్‌ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌లో త్రిష కథానాయికగా నటించింది. ఖుష్బూ, శారద, ప్రకాష్ రాజ్, ప్రదీప్ రావత్, రవళి, సునీల్, ఎల్.బి.శ్రీరామ్, బ్రహ్మానందం, ముఖేష్ రిషి, సుమన్ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించగా… అనుష్క ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది. అంజనా ప్రొడక్షన్స్ ప‌తాకంపై చిరు సోదరుడు నాగబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.

అనంత శ్రీరామ్, కందికొండ, పెద్దాడ మూర్తి, సుద్దాల అశోక్ తేజ గీత‌ర‌చ‌న‌కి… “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ ఆకట్టుకునే బాణీలు అందించారు. “గొ గొ గోవా”, “తోబారే తోబా”, “పరారే పరారే”, “ఐ వాన్న స్పైడర్‌మాన్”, “సిగ్గుతో ఛీ ఛీ” వంటి గీతాలు యువ‌త‌రాన్ని అలరించగా… “సూర్యుడే సెలవని” అంటూ సాగే పాట హార్ట్ ట‌చింగ్‌గా ఉంటుంది. 2006 సెప్టెంబర్ 20న విడుదలైన ‘స్టాలిన్’… నేటితో 13 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here