ప్రతీకార కథల్లో ఒక డిఫరెంట్ అటెంప్ట్ గ్యాంగ్ లీడర్

Latest Telugu Movies News, Latest Telugu Movies Reviews, Nani’s Gang Leader Movie Review, Nani’s Gang Leader Movie Story, Nani’s Gang Leader Review, Nani’s Gang Leader Telugu Movie Live Updates, Nani’s Gang Leader Movie Plus Points, Nani’s Gang Leader Movie Public Talk, Nani’s Gang Leader Telugu Movie Public Response, Nani’s Gang Leader Telugu Movie Review, Nani’s Gang Leader Telugu Movie Review And Rating, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

సాధారణంగా హీరోలకు వాళ్లు ఎన్నుకునే కథలను బట్టి, చేసే పాత్రలను  బట్టి ఫ్యామిలీ హీరో అని, యాక్షన్ హీరో అని, యూత్ హీరో అని, కామెడీ హీరో అని రకరకాల ఇమేజ్ లు ఏర్పడతాయి. కొన్ని సంవత్సరాలలో కొన్ని సినిమాలు చేశాక ఒక పర్టిక్యులర్ జోనర్ లో ఒక పర్టిక్యులర్ స్లాట్ లో ఇమిడిపోతుంది సదరు హీరో ఇమేజ్. కానీ కొద్ది మంది హీరోలు మాత్రం ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా ఏ రకం పాత్రలోనైనా, ఎలాంటి సబ్జెక్టుకైనా సరిపడే ఫ్లెక్సిబుల్ ఇమేజ్ ని సాధించుకుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ జోనర్లోనైనా సెట్ అయ్యే ఫ్లెక్సిబుల్ ఇమేజ్ ని సంపాదించుకున్న హీరోగా నానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ మెంట్ ఉంది. అందుకే అతని మీద దర్శక నిర్మాతలు డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేయగలుగుతున్నారు. ఈరోజు విడుదలైన నానీ’స్ గ్యాంగ్ లీడర్ ను కూడా అలాంటి డిఫరెంట్ ఎటెంప్ట్ గా అభినందించవచ్చు. హ్యట్రిక్  విజయాల మైత్రీ మూవీ మేకర్స్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నిర్మించగా హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిలింగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన  “గ్యాంగ్ లీడర్” ఎలా ఉందో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పెన్సిల్ పార్థసారథి( నాని)  అపరాధ పరిశోధనాథత్మక నవలలు రాసే ఒక రచయిత. అతని దగ్గరకు ఒక రోజు నలుగురు ఆడవాళ్లు, ఒక చిన్న పాప వస్తారు. ఆ ఐదుగురికి ఒకరితో ఒకరికి ఎలాంటి  సంబంధం ఉండదు. కానీ ఆ ఐదుగురు వచ్చింది మాత్రం ఒకటే పని మీద. తమ ఆత్మీయుల చావుకు కారణమైన వాడి మీద పగ తీర్చుకోవటం అనే ఏకైక లక్ష్యంతో వచ్చారు. వాళ్ల ప్రతీకారానికి పెన్సిల్ పార్థసారథికి సంబంధం ఏమిటి? పెన్సిల్ పార్థసారథి అపరాధ పరిశోధన నవలలను చాలా ఆసక్తిదాయకంగా రచిస్తాడు కాబట్టి నేరస్తుడిని పట్టుకోవడంలో అతని చురుకైన ఆలోచనలు తమ ప్రతీకార లక్ష్యానికి  హెల్ప్ అవుతాయి అనే ఆశతో అతని సహాయాన్ని అర్థిస్తారు. ఇంగ్లీష్ సినిమాలను మక్కీకి మక్కీగా కాపీ కొట్టి నవలలు వ్రాసుకునే పార్థసారథి ఆ నిస్సహాయమైన ఆడవాళ్ళ అభ్యర్థనను అంగీకరించి ఆ ప్రతీకార మహిళా ముఠాకు లీడర్ గా నిలబడతాడు. తన పాటికి తాను ఏవో పిచ్చి నవలలు  రాసుకునే పార్థసారథి వీళ్ళతో చేతులు కలపటానికి కారణం ఏమిటి? అసలు ఈ ఆడవాళ్ళ సంబంధీకులను చంపింది ఎవరు? అసలు ఒకరితో ఒకరికి సంబంధంలేని అయిదుగురు ఆడవాళ్లు ఒక గ్యాంగ్ గా ఎలా ఫామ్  అయ్యారు?. పెన్సిల్ పార్థసారథి వాళ్లకు ఎలా సాయపడ్డాడు? అసలు నేరస్తుడు ఎవరు? బ్యాంకు దోపిడీలో దోచుకున్న 150 కోట్ల రూపాయలను ఎవరు ఎక్కడ ఎలా దాచారు? వాటిని పెన్సిల్ పార్థసారథి అండ్ గ్యాంగ్ ఎలా కనిపెట్టింది.? ఇత్యాది ప్రశ్నలకు సమాధానంగా సాగుతుంది గ్యాంగ్ లీడర్ కథ.

విక్రమ్ కే కుమార్ డీలింగ్:

ప్రతీకార నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చినప్పటికి లేడీస్ గ్యాంగ్ తమకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించటం వెరైటీగా అనిపిస్తుంది. ఈ బ్యాక్ డ్రాప్ లో సెంటిమెంట్, క్రైమ్ అండ్ ఫన్ జనరేట్ అవ్వటానికి కథలో మంచి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని దర్శకుడు విక్రమ్ కె కుమార్ చాలావరకు ఉపయోగించుకున్నాడు. ఓపెనింగ్ సీన్ బ్యాంక్ రాబరీ తో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన దర్శకుడు ఆ తరువాత పాత్రల పరిచయాన్ని చాలా హిలేరియస్ గా నడిపించాడు. ఓవరాల్ గా వెల్ డన్ అనిపించుకున్న దర్శకుడు అక్కడక్కడ కొంత సాగదీతను మాత్రం ఎవాయిడ్ చేయలేకపోయాడు.

నటీనటుల పెర్ఫార్మెన్స్:

మొత్తం గ్యాంగ్ కి లీడర్ అయిన పెన్సిల్ పార్థసారథి పాత్రలో నాని పర్ఫార్మెన్స్ సింప్లీ లవబుల్  అనిపించింది. మంచి కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ కు అవకాశం ఉన్న ఆ పాత్ర నాని ఇమేజ్ కి టైలర్ మేడ్ అన్నట్లుగా సరిపోయింది. ఇక లేడీస్ గ్యాంగ్ కి లీడింగ్ ఫోర్స్ గా సీనియర్ నటీమణి లక్ష్మి చాలా బాగా చేశారు. ఇటీవల ‘ఓ బేబీ’, మన్మథుడు 2 చిత్రాలలో  చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో మెప్పించిన లక్ష్మి కి వెంటనే ఇలాంటి ఫుల్ ‘ లెంగ్త్ అండ్ స్త్రెంగ్థ్’ ఉన్న క్యారెక్టర్ దొరకటం వెరీ లక్కీ. ఇక హీరోయిన్ ప్రియాంక అరుల్ ఒక హాంటింగ్ బ్యూటీగా యూత్ కు గిలిగింతలు పెట్టింది.డ్యూయెట్స్, కమర్షియల్ ఎక్స్పోజర్ లేకపోయినప్పటికీ ఉన్నంతలో పాత్ర పరిధి మేరకు చాలా లవ్లీ గా, బబ్లీగా అలరించిన ప్రియాంక అరుల్ సౌత్ లో  ఒక సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా బెస్ట్ ఇన్నింగ్స్ ఆడుతుంది అనటం లో సందేహం లేదు. ఇక సీనియర్ క్యారెక్టర్ నటి శరణ్య, గే క్యారెక్టర్ లో వెన్నెల కిషోర్, హీరో ఫ్రెండ్ గా ప్రియదర్శి , పోలీస్ ఆఫీసర్ గా అనీష్ కురువిల్లా తదితరులు up to the mark నటించారు. ఇక RX 100 చిత్రంతో హీరోగా ఒక రేంజ్ కి చేరుకున్న కార్తికేయ ఇందులో మెయిన్ విలన్ దేవ్ గా సూపర్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. హీరోగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఇలా విలన్ గా టర్న్ తీసుకోవటం కెరీర్ పరంగా కార్తికేయకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చెప్పలేము గానీ ఆ పాత్రకు మాత్రం అతను చాలా బాగా షూట్ అయ్యాడు.

అనిరుద్ మ్యూజిక్, ఎమ్. కె. బ్రోజక్ కెమెరా, నవీన్ నూలి ఎడిటింగ్ వంటి టెక్నికల్ సపోర్ట్ బాగా కుదిరింది. ఇక  ఇలాంటి లైటర్ వీన్ ఎంటర్ టైనర్ కు డైలాగ్ సపోర్టు చాలా అవసరం. చక్కటి సెన్సాఫ్ హ్యూమర్ తో పాత్రోచితమైన డైలాగ్స్ రాసిన వెంకట్ కు ప్రత్యేక అభినందనలు దక్కాలి. ఇక మేకింగ్ పరంగా చెప్పాలంటే మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ గా పేరుపొందిన మైత్రి మూవీ మేకర్స్ అధినేతలైన  ఎర్నేని నవీన్, రవి, మోహన్ చెరుకూరిల నిర్మాణ దక్షతకు, అభిరుచికి అద్దం పడుతుంది ‘గ్యాంగ్ లీడర్’.

గతంలో జెంటిల్మెన్, మజ్ను వంటి పాత టైటిల్స్ తో హిట్స్ కొట్టిన నానికి ఇప్పుడు గ్యాంగ్ లీడర్ విజయం కూడా తోడవడంతో పాత టైటిళ్ల సెంటిమెంట్ ను ఇకముందు కూడా కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =