కాలం మారింది కానీ నువ్వు మారలేదు..!

Vijayashanthi Superb Reply To Mahesh Babu,Vijayashanthi Superb Reply To Mahesh Babu,Mahesh Babu Gets Nostalgic,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekevvaru Telugu Movie Latest News,Sarileru Neekevvaru Movie Shooting Updates,Sarileru Neekevvaru Telugu Movie Latest Shooting Details

అనిల్ రావిపూడి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీనితో విజయశాంతితో మళ్లీ నటిస్తుండడం పట్ల మహేశ్ బాబు ట్విట్టర్ లో స్పందించిన సంగతి కూడా విదితమే. 1989లో ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలో మొదటిసారి ఆమెతో పాటు నటించాను. ఇప్పుడు మళ్లీ 30 ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాను. జీవితం ఫుల్ సర్కిల్ లాంటిది అని ఆమెతో తన చిన్నప్పటి ఫొటోను ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మహేష్ ట్వీట్ పై విజయశాంతి స్పందించి రిప్లై ఇచ్చారు. సంవత్సరాలు గడిచిపోవచ్చు కానీ.. నీ వ్యక్తిత్వంలో మాత్రం లో ఎలాంటి మార్పు రాలేదు.. ఆయన వ్యక్తిత్వానికి క్యూట్ నెస్ కిరీటం లాంటిది అని.. 1989 లో కొడుకుదిద్దిన కాపురం సినిమాలో కలిసి నటించాం.. అదే రోజు 1980లో కిలాడీ కృష్ణుడు సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి నటించాను అని ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా… దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + three =