మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన కామిక్ రివెంజ్ డ్రామా NANI’S గ్యాంగ్ లీడర్ మూవీ రేపు (13వ తేదీ) రిలీజ్ కానుంది. హీరో కార్తికేయ విలన్ గా నటించడం ఆసక్తికర విషయం. సీనియర్ నటి లక్ష్మి, శరణ్య, ప్రియాంక అరుళ్ మోహన్, శ్రీయా రెడ్డి, ప్రాణ్య లేడీస్ గ్యాంగ్ గా నటించగా నాని గ్యాంగ్ లీడర్ గా నటించారు. హీరో నాని సపోర్ట్ తో ఒకరితో ఒకరికి రిలేషన్ లేని ఈ గ్యాంగ్ ప్రతినాయకుడు (కార్తికేయ )పై ప్రతీకారం తీర్చుకొనే కథ తో ఈ మూవీ రూపొందింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నాని తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ .. ఫేమస్ ఇంగ్లీష్ మూవీస్ ను కాపీ కొట్టి నవలలు వ్రాసే రైటర్ పెన్సిల్ పార్ధ సారథి గా నటించానని, విలన్ పై ప్రతీకారం తీర్చుకొనే లేడీస్ గ్యాంగ్ కు సపోర్ట్ గా ఉంటానని చెప్పారు. NANI’S గ్యాంగ్ లీడర్ మూవీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ప్రేక్షకులను అలరిస్తుందని , ప్రతినాయకుడిగా నటించిన కార్తికేయ పెర్ఫార్మెన్స్ ఆసక్తికరం గా ఉంటుందని, ప్రేక్షక, అభిమానులు మెచ్చుకునేలా మూవీ రూపొందిందని, మూవీ ఆద్యంతం నవ్వులు పూయిస్తుందని నిర్మాతలు తెలిపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: