నన్నుదోచుకుందువటే మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయిన శాండల్ వుడ్ నటి నభా నటేష్ ఆ మూవీ తరువాత అదుగో మూవీ లో నటించారు. ఇస్మార్ట్ శంకర్ మూవీ ఘనవిజయంతో పలు మూవీ ఆఫర్స్ అందుకొంటున్నారు. నభా నటేష్ ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న డిస్కో రాజా మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందనున్న మూవీ లో నభా నటేష్ హీరోయిన్ గా ఎంపికయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ నిర్మించిన సీనియర్ నిర్మాత BVSN ప్రసాద్ నిర్మాణ సారథ్యం లో నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా ఒక మూవీ రూపొందనుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నెలలో ప్రారంభం కానుంది. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ప్రతి రోజూ పండగే మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. కేవలం మూడు సినిమాలలో నటించిన నభా నటేష్ కు మెగా హీరో మూవీ లో హీరోయిన్ గా సెలెక్ట్ కావడం విశేషం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: