‘ఇస్మార్ట్ శంకర్’… ఎనర్జిటిక్ స్టార్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలచిన చిత్రం. సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్… రామ్‌ను మాస్ ఆడియన్స్‌కు బాగా దగ్గర చేసింది. ఈ నేపథ్యంలోనే… తన తదుపరి చిత్రం కూడా మాస్ ఎంటర్‌టైనర్ అయితే బాగుంటుందని రామ్ భావిస్తున్నాడట. తాజా సమాచారం ప్రకారం… మాస్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన దర్శకుడు వి.వి.వినాయక్‌తో… రామ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసేందుకు సిధ్ధపడుతున్నాడని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఇటీవల రామ్‌ను సంప్రదించి ఓ కథను వినిపించాడట వినాయక్. కథలో ఆకట్టుకునే మాస్ అంశాలు ఉండడంతో రామ్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. తొలి చిత్రం ‘ఆది’ నుండి ‘ఖైదీ నంబర్ 150’ వరకు పలు మాస్ ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకులను పలకరించిన వినాయక్… రామ్ కోసం ఎటువంటి క్రేజీ సబ్జెక్ట్‌ను రెడీ చేసాడో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. త్వరలోనే రామ్, వినాయక్ ఫస్ట్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: