మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మాఫియా కామెడీ ఎంటర్టైనర్ ‘వాల్మీకి’. వరుణ్‌కి జోడీగా పూజా హెగ్డే నటించిన ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కించాడు. తమిళ సినిమా ‘జిగర్తండా’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో… కోలీవుడ్ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా… ఈ సినిమాలో వరుణ్ పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా రివీల్ చేశాడు. గద్దల కొండ గణేష్ అలియాస్ గని పేరుతో `వాల్మీకి`లో వరుణ్ సందడి చేస్తున్నాడట. కాగా… ఇప్పటికే టీజర్‌తో ఇంప్రెస్ చేసిన వరుణ్ పాత్రకు సంబంధించిన మరిన్ని విశేషాలను… ఈ రోజు (సెప్టెంబర్ 9) సాయంత్రం 4 గంటలకు రిలీజ్ కానున్న ట్రైలర్లో పొందుపరిచారట. మరి…. ప్రచారచిత్రాలతో, పాటలతో ఇంప్రెస్ చేస్తున్న `వాల్మీకి` థియేటర్లలో ఏ మేరకు మెస్మరైజ్ చేస్తాడో తెలియాలంటే ఈ నెల 20వరకు వేచిచూడాల్సిందే..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
14 రీల్స్ ప్లస్ పతాకంపై రూపొందిన `వాల్మీకి`కి మిక్కీ జే మేయర్ బాణీలు అందించాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























