“గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొట్టినోడికే ఓ రేంజ్ ఉంటుంది” అంటూ తాజాగా ‘సాహో’తో సందడి చేశాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందీ సినిమా. ఇదిలా ఉంటే… ఈ చిత్రం తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం టాలీవుడ్ టాప్ 10 చిత్రాలు (తెలుగు వెర్షన్)గా `బాహుబలి 2 – ది కంక్లూజన్`, `బాహుబలి – ది బిగినింగ్`, `రంగస్థలం`, ‘సాహో’, `ఖైదీ నంబర్ 150`, `మహర్షి`, `భరత్ అనే నేను`, `అరవింద సమేత`, `శ్రీమంతుడు`, `ఎఫ్ 2` నిలవగా… ఆ జాబితాలో ‘సాహో’ నాలుగో స్థానం దక్కించుకుంది. మరి… రానున్న రోజుల్లో ‘సాహో’ ఇంకెన్ని సంచలనాలకు కేంద్రబిందువు కానుందో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: