2020 సంక్రాంతికి పలు ఆసక్తికరమైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే… వాటిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ మాత్రం ఎంతో ప్రత్యేకం కానున్నాయి. ఎందుకంటే… ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఆ యా సినిమాలతో నిన్నటి తరం అగ్ర కథానాయికలిద్దరు భారీ విరామం తరువాత తెలుగు తెరపై దర్శనమివ్వనున్నారు. వారిలో ఒకరు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాగా… మరొకరు టాలెంటెడ్ యాక్ట్రస్ టబు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాస్త వివరాల్లోకి వెళితే… రాజకీయ రంగంపై దృష్టి సారించడంతో ‘నాయుడమ్మ’ (2006) తరువాత మళ్లీ సినిమాల్లో కనిపించని విజయశాంతి… ఇప్పుడు 13 ఏళ్ళ సుదీర్ఘ విరామం తరువాత ‘సరిలేరు నీకెవ్వరు’తో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో… విజయశాంతి ఓ శక్తిమంతమైన పాత్రలో దర్శనమివ్వబోతున్నారు.
ఇక… 90ల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన టబు… ‘పాండురంగడు’ (2008) తరువాత తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. కట్ చేస్తే… మళ్ళీ పదకొండేళ్ళ విరామం అనంతరం ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘అల… వైకుంఠపురములో…’ చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో టబు పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సమాచారం.
మరి… దశాబ్దానికి పైగా గ్యాప్ తీసుకుని మళ్ళీ తెలుగు తెరపై కనువిందు చేయనున్న విజయశాంతి, టబుకి… ఈ రీ-ఎంట్రీ మూవీస్ ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: