సెప్టెంబర్ లో పాత టైటిల్స్‌తో కొత్త సినిమాల సందడి

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Old Movie Titles For September Movie Releases, Old Movie Titles, Upcoming Movie Releases with Old Titles, September Movie Releases, Movies Releasing In September 2019, New Movies Releasing with Old Titles

పాత సినిమాల పేర్ల‌తో కొత్త సినిమాలు తెరకెక్కడం అనాదిగా ఉన్న వ్యవహారమే. అయితే… ఒకే నెల‌లో వ‌రుస‌గా మూడు వారాల పాటు ఇటువంటి టైటిల్స్‌తో సినిమాలు విడుదల కావడం అంటే… క‌చ్చితంగా వార్త‌ల్లో నిల‌చే అంశ‌మే. అలా… 2019 సెప్టెంబర్ టాలీవుడ్ కి ప్రత్యేకం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాస్త వివరాల్లోకి వెళితే… సెప్టెంబర్ 6న ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన ‘జోడీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అదే రోజున అజిత్ రాధారామ్, దీక్షితా పార్వతి హీరోహీరోయిన్లుగా నటించిన ‘నీ కోసం’ కూడా విడుదల కానుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ రెండు చిత్రాలు కూడా 1999లో విడుదలైన సినిమాల టైటిల్స్‌తో రూపొందినవే కావడం విశేషం. ఇక సెప్టెంబర్ రెండో వారంలో అంటే… సెప్టెంబర్ 13న నాని కథానాయకుడిగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ రాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’(1991) టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఇక… సెప్టెంబర్ 20న వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన మాఫియా కామెడీ ‘వాల్మీకి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. మహానటుడు యన్.టి.రామారావు నటించిన ‘వాల్మీకి'(1963) చిత్రం టైటిల్‌తో ఈ చిత్రం రూపొందటం విశేషం.

మరి… పాత టైటిల్స్‌తో తెర‌కెక్కిన ఈ కొత్త చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తాయో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 12 =