దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం రామ్ చరణ్ బ్రేక్ లో ఉండగా.. ఎన్టీఆర్ కి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం బల్గెరియా వెళ్లనున్నారట చిత్ర యూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ముందుగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించేందుకు హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ ను ఎంపిక చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో డైసీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో మరో హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డాడు రాజమౌళి. అయితే తాజా సంచారం ప్రకారం రాజమౌళి ఎట్టకేలకు మరో మారు బ్రిటిష్ నటినే ఎంపిక చేశారని సమాచారం. త్వరలోనే ఆ హీరోయిన్ ఎవరో అధికారికంగా ప్రకటించనున్నారట.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ లో నటిస్తున్నాడు. చెర్రీ సరసన ఆలియా భట్ నటిస్తుండగా.. అజయ్ దేవగణ్, సముద్ర ఖని వంటి ప్రముఖ నటులు ఇతర కీలకపాత్రలలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది జూలై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: