చాలా లాంగ్ గ్యాప్ తర్వాత రాజ్ తరుణ్ ఇప్పుడిపుడే వరుస సినిమాలను కమిట్ అవుతూ కెరీర్ ను గాడిలో పెట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే గుండె జారి గల్లంతయ్యిందే ఫేం కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. దీనితో పాటు దిల్ రాజు ప్రొడక్షన్‌లో ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాలో రాజ్‌తరుణ్ నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ రోజు రాజ్ తరుణ్ పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు నార్సింగ్ సమీపంలో అల్కాపూర్ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురైంది. కారు రోడ్డు పక్కన ఉన్న ప్రహారీ గోడను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే అదృష్టవశాత్తు…రాజ్‌తరుణ్ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినట్టు తెలిసింది.
[subscribe]
[youtube_video videoid=HNnt00swZ5Q]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: