మన్మథుడు 2 తెలుగు మూవీ రివ్యూ – ఫన్ అండ్ ఎమోషన్

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో మన్మథుడు సీక్వెల్ మన్మథుడు 2 సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. మన్మథుడు సినిమా అంత సూపర్ హిట్ అయిందా తెలియాలంటే మాత్రం రివ్యూ లోకి వెళ్లాల్సిందే…

న‌టీన‌టులు: నాగార్జున‌, ర‌కుల్‌ప్రీత్ సింగ్‌, ల‌క్ష్మి, వెన్నెల‌ కిషోర్‌, రావు ర‌మేష్‌, ఝాన్సీ, దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు
దర్శకత్వం: రాహుల్ ర‌వీంద్రన్‌
నిర్మాత‌లు: నాగార్జున, పి.కిర‌ణ్‌
సంగీతం: చైత‌న్‌ భ‌రద్వాజ్‌

కథ:

సామ్‌ అలియాస్ సాంబశివ రావు(నాగార్జున) పోర్చుగల్‌లో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇక అక్కడ సామ్ పెళ్లి అనే ఆలోచన లేకుండా తనకు ఇష్టమొచ్చినట్టు లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు. ఇంట్లోవాళ్లు పెళ్లి చేసుకోవాల‌ని ఎంత ఒత్తిడి చేసినా. వాళ్ల మాట‌ల్ని అస్సలు పట్టించుకోకుండా జీవితాన్ని ఆస్వాదిస్తుంటాడు సామ్‌. అయితే ఇంట్లో మరీ ఒత్తిడి ఎక్కువవడంతో.. ఒక ఒప్పందం ప్రకారం అవంతిక (ర‌కుల్‌ప్రీత్ సింగ్‌)ని తన లవర్ గా పరిచయం చేస్తాడు. త‌న‌కున్న స‌మస్యల కార‌ణంగా అందుకు ఒప్పుకుని ఇంటికొచ్చిన అవంతిక… సామ్‌ కుటుంబస‌భ్యుల‌కి దగ్గర‌వుతుంది. కొన్ని అనుకోని మలుపుల తరువాత సామ్ జీవితం తలకిందులవుతుంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? సామ్ జీవితంలో చేసిన తప్పులు ఏమిటి? తాను చేసిన ఆ పొరపాట్లను ఎలా సరిదిద్దుకున్నాడు? అసలు ఆ ఒప్పదం ఏంటి..? సామ్‌ కు అవంతికకు పెళ్లి జరిగిందా ? లాంటి విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

నిజానికి ఈ సినిమా చూడటానికి వెళ్లే ప్రతి ప్రేక్షకుడికి మైండ్ లో మన్మథుడు సినిమానే తిరుగుతుంటుంది. ‘మ‌న్మథుడు’ని మ‌న‌సులో పెట్టుకొని, ఆ అంచ‌నాల‌తోనే ఈ సినిమాకి వెళ‌తారు ప్రేక్షకులు. ఎందుకంటే ఆ సినిమాతోనే కదా నాగార్జున కి మన్మథుడు అనే ట్యాగ్ లైన్ వచ్చింది. మన్మథుడు లో అమ్మాయిలంటే చిరాకు పడే పాత్ర అది. కానీ ఈ సినిమాలో రోల్ అందుకు పూర్తి విభిన్నం. ఈ సినిమాలో నాగ్ ప్లేబాయ్ తరహా పాత్రలో నటిస్తాడు. ఆయను చూస్తుంటే నాగ్ కు ఏజ్ పెరుగుతుందా? తగ్గుతుందా? అన్న డౌట్ మాత్రం రాకుండా ఉండదు. మన్మధుడు గా తన చార్మింగ్ గ్లామర్ తో ఆకట్టుకుంటాడు. అలాగే జీవితాన్ని నచ్చినట్టుగా ఆస్వాదించే ప్లే బాయ్ పాత్రలో కానీ, కామెడీ పరంగా కానీ, ఎమోషన్స్ కానీ ఆయన చక్కగా పండించారు.

ఇక రకుల్ కు కూడా ప్రాధాన్యత వున్న పాత్ర దక్కింది. అటు గ్లామర్ పరంగా, నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. నేటిత‌రం అమ్మాయిగా కామెడీ పండిస్తూనే, అందులో భావోద్వేగాల్ని కూడా చ‌క్కగా పండించింది. ఇక మూవీ ఆహ్లాదంగా సాగడంలో నటుడు వెన్నెల కిషోర్ కామెడీ చక్కగా పనిచేసింది. ఆయన కామెడీ టైమింగ్ తోపాటు, నాగార్జున కు ఆయనకు మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పండిస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ అలరిస్తుంది. ల‌క్ష్మి, ఝాన్సీ, దేవ‌దర్శిని పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. రావు ర‌మేష్ త‌న‌దైన మార్క్ న‌ట‌న‌ని ప్రద‌ర్శించారు. అతిథి పాత్రల్లో కీర్తి సురేశ్‌, సమంత మెరుస్తారు.

‘చిలసౌ’ సినిమాతో ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్‌ రెండో సినిమానే మన్మథుడు 2 లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేసే చాన్స్‌ సాధించాడు. అక్కినేని అభిమానులు నాగార్జునను ఎలా చూడాలనుకుంటారో అలాగే చూపించాడు రాహుల్‌. నాగార్జునను ఆయన తెరపై చూపించిన విధానం, ఆయన పాత్ర రూపొందించిన తీరు మాత్రం బాగుంది. నాగార్జున, వెన్నెల కిషోర్ కామెడీ, అవంతిక‌గా ర‌కుల్‌ చేసే సంద‌డితో ప్రథమార్ధం స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోతుంది. ఇంట్రస్టింగ్ ట్విస్ట్‌తో సెంకడాఫ్‌లోకి తీసుకువెళ్లిన దర్శకుడు ఆ ఫ్లోను కంటిన్యూ చేయలేకపోయారు. సెకండ్ హాఫ్ లో ఇంకొంచం జాగ్రత్తలు తీసుకుంటే బావుండేది.

చైత‌న్ భ‌రద్వాజ్ సంగీతం, సుకుమార్ కెమెరా ప‌నిత‌నం చిత్రానికి ప్రధానబ‌లం. ముఖ్యంగా పోర్చుగ‌ల్ అందాల్ని సుకుమార్ కెమెరాలో బంధించిన తీరు ఆక‌ట్టుకుంటుంది.

ప్లస్‌ పాయింట్స్‌ :
నాగార్జున
కామెడీ
కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :
అక్కడక్క కొన్ని అసందర్భ సన్నివేశాలు

 

 

మన్మథుడు 2 తెలుగు మూవీ రివ్యూ
  • Story
  • Screen Play
  • Direction
  • Performance
3.3
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=URWUwn8ATzg]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here