మనం, హలో ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ తుది దశకు చేరుకుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రీ లుక్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు.
ఇంకా ఈ సినిమాను త్వరగా కంప్లీట్ చేసి ఆగష్ట్ 30 వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ భారీ బడ్జెట్ సినిమా సాహో ఆగష్ట్ 15నుండి ఆగష్ట్ 30 కు వాయిదా పడింది. దీంతో గ్యాంగ్ లీడర్ సెప్టెంబర్ 13న రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సెప్టెంబర్ 13న వాల్మీకి సినిమా రిలీజ్ కాబోతుంది. మరి గ్యాంగ్ లీడర్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాడో తెలియాలంటే అధికారింగా ప్రకటించేతవరకూ ఆగాల్సిందే.
[subscribe]
[youtube_video videoid=CLG-meEqQT4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: