మారిన వాల్మీకి రిలీజ్ డేట్

2019 Latest Telugu Movie News, Valmiki Movie Release Date Gets Changed, Varun Tej Valmiki gets New release date, Harish Shankar announces New release date of next, Valmiki Movie Latest Updates, Valmiki Movie Release Updates, Varun Tej Valmiki Release Date Fixed, Telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Valmiki Movie Release Date Gets Changed

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో హరీష్ శంకర్ రూపొందిస్తున్న‌ చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తండా’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో త‌మిళ న‌టుడు అధ‌ర్వ మురళి కీలక పాత్రను పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చారు చిత్రయూనిట్. మొదట ఈసినిమాను సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ చేశారు. అయితే ఏమైందో తెలియదు కానీ మళ్లీ రిలీజ్ డేట్ ను మార్చుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 13వ తేదీన సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరి ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీ టీజర్‌ సినిమా పై విపరీతంగా అంచనాలు పెంచింది. ముఖ్యంగా ప్రీ టీజర్ లో వరుణ్‌ తేజ్‌ గ్యాంగ్‌ స్టర్‌ లుక్‌ లో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పటివరకు డిఫరెంట్‌ జోనర్స్‌లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాలో మొదటిసారి గ్యాంగ్‌ స్టర్‌ గా మరో డిఫరెంట్‌ క్యారెక్టర్‌ లో కనిపించబోతున్నాడు. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ అయ్యేంతవరకూ ఆగాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=t-SWlHFaFUk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 14 =