చిరు ఇండ‌స్ట్రీ హిట్‌ ‘ఇంద్ర’కు 17 ఏళ్ళు

2019 Latest Telugu Movie News, Megastar Chiranjeevi Industry Hit Indra Movie Completes 17 years, Mega Star chiranjeevi Indra Completed 17 Years, Indra Movie Completed 17 Years, 17 Years Completed Indra Telugu Movie, 17 years For Indra Movie, 17 years Of Indra, Indra Movie Updates, Telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News, chiranjeevi Latest Movie News
Megastar Chiranjeevi Industry Hit Indra Movie Completes 17 years

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ప‌లు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘ఇంద్ర’ ఒకటి. భారీ బ‌డ్జెట్ మూవీస్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిల‌చిన ప్ర‌ముఖ నిర్మాత సి.అశ్వ‌నీద‌త్‌… త‌మ సంస్థ వైజ‌యంతీ మూవీస్‌ సిల్వ‌ర్ జూబ్లీ ఇయ‌ర్స్‌ను పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘చూడాలని వుంది!’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ త‌రువాత చిరు, అశ్వ‌నీద‌త్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమా కూడా ఘ‌న‌విజ‌యం సాధించింది. ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రానికి బి.గోపాల్ దర్శకత్వం వహించాడు. బి.గోపాల్ పుట్టిన‌రోజు కానుక‌గా విడుద‌లైన `ఇంద్ర‌… అత‌ని కెరీర్‌లో మెమ‌ర‌బుల్ ఫిల్మ్‌గా నిల‌చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిరుకి జోడీగా సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో… ముఖేష్ రిషి, బ్ర‌హ్మానందం, తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్, శివాజీ, సునీల్, అల్లు రామలింగయ్య, ‘ఆహుతి’ ప్రసాద్, ల‌హ‌రి త‌దిత‌రులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు. “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ స్వరసారథ్యంలో రూపొందిన పాట‌ల‌న్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా… `దాయి దాయి దామ్మా` పాట‌లో చిరు వీణ స్టెప్ సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌చింది. 2002 జూలై 24న విడుద‌లైన `ఇంద్ర‌`… నేటితో 17 ఏళ్ళ‌ను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

[youtube_video videoid=lTEXo8m87LM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =