సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకి ఆర్.రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తున్నాడు. అనిల్ సుంకర, `దిల్`రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అక్కడ మహేష్, రాజేంద్రప్రసాద్ తదితరులపై ఆర్మీ నేపథ్యంలో సాగే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. కాగా, ఓ స్పెషల్ డేన (సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు (మే 31)) ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోగా… మరో స్పెషల్ డేన ఫస్ట్ లుక్‌ని విడుదల చేసే దిశగా యూనిట్ సన్నాహాలు చేస్తోందట. ఆ రోజే మరేదో కాదు… మహేష్ పుట్టినరోజు అయిన ఆగస్టు 9. అయితే, ఈ ఫస్ట్ లుక్‌కి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
2020 సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు` థియేటర్లలో సందడి చేయనుంది.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.