రీమేక్‌లో న‌టిస్తున్న‌ శ్రియ‌

2019 Latest Telugu Movie News, Shriya Saran to act in Remake Movie, Shriya to make a comeback with Vemal next, Vimal and Shriya Saran team up for a blockbuster remake, Shriya teams up with Vemal for a film My Boss, My Boss Movie Latest News, Shriya Saran Upcoming Remake Movie Latest Updates, Telugu flimnagar, Tollywood Cinema Latest News

పెళ్ళ‌య్యాక సినిమాల విష‌యంలో కాస్త జోరు త‌గ్గించిన టాలెంటెడ్ బ్యూటీ శ్రియ‌… మ‌ళ్ళీ ఇప్పుడిప్పుడే వాటిపై దృష్టి సారిస్తోంది. ఇటీవ‌ల‌ ఒక‌ట్రెండు తెలుగు చిత్రాల్లో శ్రియ పేరు ప్ర‌ముఖంగా వినిపించినా… ఆ సినిమాలకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. అయితే, తాజాగా ఓ త‌మిళ చిత్రానికి మాత్రం ఈ సీనియ‌ర్ హీరోయిన్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. `దృశ్యం` (మ‌ల‌యాళం) ద‌ర్శ‌కుడు జీతూ జోసెఫ్ తెర‌కెక్కించిన మ‌ల‌యాళ చిత్రం `మై బాస్‌`(2012) ఆధారంగా తెర‌కెక్కనున్న ఈ సినిమాలో విమ‌ల్‌కి జోడీగా న‌టించ‌నుంది శ్రియ‌. `సండ‌క్కారి – ది బాస్‌` పేరుతో రూపొంద‌నున్న‌ ఈ సినిమాకి ఆర్‌.మాదేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. యాక్ష‌న్‌, కామెడీ, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న‌ ఈ సినిమా లండన్‌, న్యూయార్క్‌, గోవా ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంది. మ‌రి… త‌మిళ‌నాట‌`శివాజీ – ది బాస్‌`తో విజ‌యాన్ని అందుకున్న శ్రియ‌… `సండ‌క్కారి – ది బాస్‌`తోనూ అదే బాట ప‌డుతుందేమో చూద్దాం. కాగా, శ్రియ న‌టించిన త‌మిళ చిత్రం `న‌ర‌గాసురన్‌`, హిందీ మూవీ `త‌డ్కా` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=2nTAhBqwWQc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.