గత ఏడాది సంచలనం `ఆర్ ఎక్స్ 100`తో కథానాయకుడిగా తొలి విజయాన్ని అందుకున్నాడు కార్తికేయ. ఇటీవల `హిప్పీ`గా సందడి చేసిన ఈ టాలెంటెడ్ హీరో… ప్రస్తుతం `గుణ 369`, `గ్యాంగ్ లీడర్`, `90 ఎం.ఎల్` చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కాగా, వీటిలో రెండు చిత్రాలు ఒకే నెలలో విడుదలకు సిద్ధమయ్యాయి. ఆ సినిమాలే… `గుణ 369`, `గ్యాంగ్ లీడర్`.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న `గుణ 369` ఆగస్టు 2న రిలీజ్ కానుండగా… ప్రతినాయకుడిగా నటిస్తున్న `గ్యాంగ్ లీడర్`(ఇందులో నేచురల్ స్టార్ నాని కథానాయకుడు) ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే… ఒకే నెలలో కార్తికేయ హీరోగానూ, విలన్‌గానూ సందడి చేయనున్నాడన్నమాట. ఈ రెండు సినిమాలూ విజయం సాధించి కార్తికేయకు నటుడిగా మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిద్దాం.
[youtube_video videoid=tZE-1QFV8SE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: