సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. కొంత మంది హీరో హీరోయిన్లు సోషల్ మీడియా వేదికగా తమ సినిమా అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండరన్న సంగతి కూడా విదితమే. వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. ఆయనకు ఫేస్‌బుక్ ఖాతా ఉంది. ఇటీవలే తన ట్విట్టర్ ను కొన్ని కారణాల వల్ల క్లోజ్ చేసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ కూడా ఇన్ స్టాగ్రామ్ లో అడుగుపెట్టారు. రామ్ చరణ్ ఇన్ స్టాగ్రామ్ లో ఆల్వేస్ రామ్ చరణ్ అంటూ ఖాతా తెరిచారు. దాంట్లో ఇప్పటివరకు తన ప్రొఫైల్ పిక్ ను మాత్రం పోస్టు చేశారు. ఇక చెర్రీ అలా అకౌంట్ తెరిచాడో లేదో కొద్దిసేపట్లోనే 16.7 వేలమందికి పైగా అనుసరించడం మొదలుపెట్టారు. ఇక చరణ్ అభిమానులు తమ అభిమాన హీరో గురించి ఎప్పుటికప్పుడూ అప్ డేట్స్ తెలుసుకోవచ్చు.
[youtube_video videoid=xxPb9zh2_lM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: