సమంత నువ్వు ఓ అద్భుతం

2019 Latest Telugu Movie News,Nagarjuna Praises Samantha Performance in Oh Baby Movie, Oh Baby receive praises from Nagarjuna, Samantha is incredible says Nagarjuna, Nagarjuna Appreciates Samantha for her Performance in Oh Baby, Nagarjuna Speaks About Samantha Performance In Oh Baby Telugu Movie, Samantha Oh Baby Movie Latest News, Samantha Oh Baby Movie Updates, Telugu Cinema Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Nagarjuna Praises Samantha Performance in Oh Baby Movie

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓ బేబి సినిమా 5వ తేదీన రిలీజై మంచి ప్రేక్షకాదరణ పొందుతుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఇక ఈసినిమాలో సమంత నటన గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమంత నటనకు 100 కి 100 మార్కులు పడుతున్నాయి. ఏమంట లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకుందో కానీ నిజంగానే ఆ పేరు సమంతకు కరెక్ట్ గా సరిపోతుంది. పెళ్లైన తరువాత కూడా హిట్ సినిమాలతో దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా చూసిన మామ నాగార్జున కూడా చిత్రయూనిట్ పై సమంతపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ఓ బేబీ’ చాలా నచ్చింది. లక్ష్మి గారు, రావు రమేశ్‌, రాజేంద్ర ప్రసాద్‌.. ప్రతి ఒక్కరు చక్కగా నటించారు. ప్రియమైన సమంత నువ్వు నమ్మశక్యం కాని ఓ అద్భుతం. నందిని రెడ్డికి హ్యాట్సాఫ్‌’ అని నాగార్జున తన ట్విట్టర్ ద్వారా పోస్ట్‌ చేశారు. ఇక దీనిపై సమంత కూడా స్పందిస్తూ…‘సంతోషంతో డ్యాన్స్‌ చేస్తున్నా.. మీరు నా కోసం చేసిన ప్రతి పనికి ధన్యవాదాలు. విడుదల రోజున పరిస్థితి తెలుసుకోవడానికి గంట గంటకూ ఫోన్‌ చేసినందుకు కూడా థాంక్స్‌. మీరు నిజంగా ది బెస్ట్’ అని ట్వీట్ చేసింది.

కాగా ఈ చిత్రంలో స‌మంత‌ తో పాటు నాగశౌర్య, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించారు.

[subscribe]

[youtube_video videoid=1Nxbm_prJ0Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 3 =