సినీ పరిశ్రమలో ఒక్కో టైమ్ కి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. గత కొద్దికాలంగా ఏ పరిశ్రమలో చూసినా బయోపిక్ ల హవానే నడిచింది.. ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది. ఇంకా రీమేక్ హవా కూడా నడుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు తెలుగులో మాత్రం నయా ట్రెండ్ నడుస్తుందని చెప్పొచ్చు. అదే తెలంగాణ స్లాంగ్. ఒకప్పుడు సినిమాల్లో పెద్దగా వినిపించని ఈ స్లాంగ్ ఇప్పుడు మాత్రం సినిమాలు హిట్టవడానికి కారణమవుతుంది. యూత్ ఈ స్లాంగ్ కు ఫిదా అవుతున్నారు. ఇక దర్శకులు కూడా ఈ స్లాంగ్ తో స్పెషల్ స్క్రిప్ట్ లను సైతం రాస్తున్నారు. బెస్ట్ క్యారెక్టర్స్ ని సృష్టిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవల శేఖర్ కమ్ముల ఫిదా సినిమాలో సాయి పల్లవితో పూర్తి తెలంగాణ యాసలో మాట్లాడిచ్చాడు. భాగమతి క్యారెక్టర్ లో జీవించిన సాయి పల్లవి తెలంగాణ స్లాంగ్ ను కూడా అంతే చక్కగా నేర్చుకొని సినిమాకు తానే హీరో అయింది. ఒకరకంగా ఆ సినిమా అంత పెద్ద హిట్టవ్వడానికి ఒక రకంగా తానే కారణమని చెప్పొచ్చు. గతంలో కూడా శేఖర్ కమ్ముల తెలంగాణ స్లాంగ్ ను బాగానే వాడాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో ముగ్గురు హీరోలు ఉంటే నాగరాజు పాత్ర చేసిన సుధాకర్ మొత్తం తెలంగాణ స్లాంగ్ లోనే మాట్లాడతాడు.
పెళ్లి చూపులు సినిమా తీసిన తరుణ్ భాస్కర్ కూడా తెలంగాణ స్లాంగ్ ను బాగానే వాడుకున్నాడు. ప్రియదర్శికి తెలంగాణ స్లాంగ్ లో ఇచ్చిన డైలాగ్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమాతో ప్రియదర్శి ఫేట్ కూడా ఓ రేంజ్ లో మారిపోయింది. తెలంగాణ స్లాంగ్ లో ప్రియదర్శి చెప్పిన ఒక్కో డైలాగ్ నవ్వులు పూయించింది.
ఇక అర్జున్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ, ఫ్రెండ్ గా నటించిన రాహుల్ రామకృష్ణ అయితే తెలంగాణ స్లాంగ్ ను దించేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తరువాతనే ఈ స్లాంగ్ కు ఇంకా డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. శివ క్యారెక్టర్లో రాహుల్ రామకృష్ణ తెలంగాణ స్లాంగ్ లో చెప్పే డైలాగ్స్.. విజయ్ దేవరకొండ డైలాగ్స్ బాగా క్లిక్ అయ్యాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ ఇంకా వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన మల్టీ స్టారర్ సినిమా ఎఫ్ 2 రూపొంది సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఫుల్ గా తన టైమింగ్ తో తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టేసాడు.
ఇక రీసెంట్ గా వచ్చిన ఫలక్ నుమా దాస్ లో అయితే పక్కా హైద్రాబాదీ ఎట్మాస్ఫియర్ తో పాటు తెలంగాణ స్లాంగ్ ను వాడుకున్నాడు విశ్వక్ సేన్. ఈ సినిమాకు కూడా యూత్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు మరో యువ హీరో రామ్ కూడా ఇస్మార్ట్ శంకర్ తో పర్ఫెక్ట్ హైదరాబాద్ లాంగ్వేజ్ తో రాబోతున్నాడు. ఈ సినిమాలో పూరి ఎప్పుడూ లేని కొత్త కొత్త మాస్ డైలాగ్స్ ని తెలంగాణ స్లాంగ్ లో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఆ విషయం టీజర్ ను చూస్తేనే అర్ధమవుతోంది. ఎక్కడ ఏ చిన్న డిటైల్ కూడా వదలకుండా ఫుల్ పక్కా తెలంగాణ స్లాంగ్ తో వస్తున్నాడు. ఇక రామ్ కూడా మాస్ క్యారెక్టర్ కి బాగా సూటయ్యాడు. మరి సినిమా చూస్తే కానీ.. రామ్ ఇస్మార్ట్ శంకర్ తో తెలంగాణ యాసలో ఎంతవరకు మెప్పిస్తాడో అన్న విషయం అర్ధమవుతుంది.
మొత్తానికి ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ పెరుగుతుంది. టాలీవుడ్ యంగ్ హీరోలు ఈ స్లాంగ్ ను కూడా వాడేసి తమ ముచ్చట తీర్చుకుంటున్నారు.. మహేష్ ఆగడు సినిమాలో అక్కడక్కడ ట్రై చేశాడు.. మిగిలిన సీనియర్ హీరోలు కూడా ఆ ముచ్చట తీర్చుకుంటారేమో చూద్దాం… [subscribe]
[youtube_video videoid=JxLXURcTA0k]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: