కన్నడలో నరేష్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలుసు. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో కూడా నరేష్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చేతన్ మద్దినేని, కషిష్ వొహ్రా, ప్రకాష్ రాజ్, ప్రియదర్శి, బ్రహ్మానందం, రావు రమేష్, నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. జూన్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. జూన్ 14వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
కాగా డాల్ఫిన్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై మంజునాథ్ వి కందుకూర్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. కిరణ్ రవింద్ర నాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి కన్నడంలో మంచి హిట్ అయిన్ ఈ సినిమా ఇక్కడ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో తెలియాలంటే రిలీజ్ అయ్యేంతవరకూ ఆగాల్సిందే.
[youtube_video videoid=F97qoYMuskg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: