యాక్షన్ స్టార్ గోపిచంద్, మెహరీన్ జంటగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో స్పై థిల్లర్ మూవీ చాణక్య రూపొందుతున్న విషయం తెలిసిందే. 2001 సంవత్సరంలో తొలి వలపు మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయమైన గోపి చంద్, ప్రతి నాయకుడిగా కొన్ని చిత్రాలలో నటించి సూపర్ హిట్ మూవీ యజ్ఞం తో హీరోగా సెటిల్ అయ్యారు. గోపి చంద్ నటించిన ఆంధ్రుడు , రణం, లక్ష్యం, శౌర్యం, గోలీమార్, సాహసం, లౌక్యం, గౌతమ్ నంద, ఆక్సిజన్ మూవీస్ ఘనవిజయం సాధించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గోపి చంద్ కు చాణక్య 26వ మూవీ. గోపిచంద్ బర్త్ డే సందర్భంగా చాణక్య మూవీ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. హీరో గోపీచంద్ లుక్ ఇంప్రెసివ్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చాణక్య మూవీ కి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు. చాణక్య మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ రాజస్థాన్ లోని జైసల్మేర్ పరిసర ప్రాంతాలలో జరిగింది. సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సంవత్సరం లోనే చాణక్య మూవీ ని రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Happy Birthday @YoursGopichand Sir. This is for you. 1st look of #Chanakya @AnilSunkara1 @Mehreenpirzada @zareen_khan @vetrivisuals @upenpatelworld @Composer_Vishal @silvastunt @kishore_Atv @ramjowrites @abburiravi @AbhishekOfficl @RajeshDanda_ @raajmohan73 #HBDGopichand pic.twitter.com/2NsWe4qwwy
— Thiru (@dir_thiru) June 12, 2019
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: