కేవలం తెలుగు సినీ సెలబ్రిటీలకు మాత్రమే కాదు సౌత్ లోనే టాప్ హీరోయిన్ లకు కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు శ్రవ్య వర్మ. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్, రష్మిక మందన, పీవీ సింధూ, సైనా నెహ్వాల్.. అలాగే తమిళ్ లో త్రిష పులువురికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఇక కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూనే శ్రవ్య వర్మ…ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కూడా మారింది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు శ్రవ్య వర్మ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలోనే శ్రవ్య వర్మ తాను డిజైనర్ గా పనిచేస్తున్న సెలబ్రిటీల సమక్షంలో బర్త్ డే పార్టీ జరుపుకున్నారు. ఈ పార్టీకి రష్మిక మందన, కీర్తి సురేష్, సైనా నెహ్వాల్, దేవి శ్రీ ప్రసాద్ ఇలా పలువురు సెలబ్రిటీలు శ్రవ్య వర్మ బర్త్ డే పార్టీలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను శ్రవ్య వర్మ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. మరి కాస్ట్యూమ్ డిజైనర్ గా మంచిగా సక్సెస్ అయిన శ్రవ్య వర్మ ప్రొడ్యూసర్ గా కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం..
[subscribe]
[youtube_video videoid=0boK2RJxLBw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: