విలన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయే నటుడు రియల్ స్టార్ శ్రీహరి. యాక్షన్ అయినా…సెంటిమెంట్ అయినా… పరకాయ ప్రవేశం చేసి మరీ నటిస్తాడు. ఇక కామెడీ గురించి అయితే చెప్పనక్కర్లేదు… తెలంగాణ యాసలో మాట్లాడుతూ శ్రీహరి చేసే కామెడీకైతే పొట్ట చెక్కలవ్వాల్సిందే. అలా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన శ్రీహరి గత కొద్ది సంవత్సరాల క్రితమే అకాల మరణం చెందారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఆయన వారత్వాన్ని అందిపుచ్చుకొని తనయుడు మేఘాంశ్ శ్రీహరి ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు. రాజ్ దూత్ అనే యూత్ ఎంటర్టైనర్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. అర్జున్.. కార్తీక్ అనే ఇద్దరు దర్శకులు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా సత్తిబాబు నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఫస్ట్ లుక్ కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి భవిష్యత్తే ఉంటుందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
[subscribe]
[youtube_video videoid=Dp644lyVaDo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























