కన్నడంలో కూడా తిప్పరా మీసం-ప్రీ లుక్ రిలీజ్

2019 Latest Telugu Movie News, Pre Look of Sri Vishnu Thippara Meesam Movie, Telugu Film Updates, Telugu Filmnagar, Thippara Meesam Movie Latest Updates, Thippara Meesam Movie Pre Look, Thippara Meesam Movie Pre Look Released in Kannada, Thippara Meesam Pre Look, Tollywood Cinema News
Thippara Meesam Movie Pre Look Released in Kannada

‘నీదీ నాదీ ఒకే కథ’, ‘మెంటల్ మదిలో’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ లాంటి వైవిధ్యభరితమైన సినిమాలతో మంచి గుర్తింపుతెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు. ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో మన ముందుకు వస్తున్నాడు. అసుర మూవీ దర్శకుడు కృష్ణ విజయ్ దర్శకత్వంలో శ్రీవిష్ణు కథా నాయకుడిగా తిప్పరా మీసం మూవీ రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకూ సాఫ్ట్ లుక్ లో కనిపించిన శ్రీవిష్ణు.. ఈ సినిమాలోపూర్తి గడ్డంతో, మీసంతో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా ఈ సినిమా గురించి మరో అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడంలో కూడా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు.. ఈ సినిమా ప్రీ లుక్ ను రిలీజ్ చేస్తూ.. ఫస్ట్ లుక్ ను త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్టు శ్రీవిష్ణు ట్వీట్ లో పేర్కొన్నారు.

 


కాగా ఈ సినిమాలో హీరో శ్రీవిష్ణు కు జంటగా నిక్కీ తంబోలి నటిస్తుంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీ ఓం సినిమా బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. మరి ఇప్పటివరకూ సాఫ్ట్ కథలతో కంటెంట్ ఉన్న స్టోరీలతో అలరించిన శ్రీవిష్ణు ఈసినిమాతో ఎలా అలరిస్తాడో చూద్దాం. ఇక ఈ మూవీ తో పాటు హీరో శ్రీవిష్ణు క్రైమ్ కామెడీ మూవీ బ్రోచేవారెవరురా లో కూడా నటిస్తున్నాడు.

[subscribe]

[youtube_video videoid=zKwu5ZsQMH8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =