కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

కన్ఫామ్ కన్నప్పలో కాజల్

kajal aggarwal on board for manchu vishnus kannappa movie

కన్ఫామ్ కన్నప్పలో కాజల్

Kajal Aggarwal on Board for Manchu Vishnus Kannappa Movie

kajal aggarwal on board for manchu vishnus kannappa movie

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు.ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా నుండి మంచు విష్ణు ఎప్పటికప్పుడు అప్ డేట్లను ఇస్తూనే ఉన్నాడు. ప్రతి అప్ డేట్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతూనే వస్తోంది. అంతేకాదు టీజర్ రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. మే20వ తేదీన కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేదికగా ఈటీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

రీసెంట్ గా నే ఈసినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొన్నట్టు విష్ణు తెలియచేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఈసినిమాలో మరో స్టార్ హీరోయిన్ జాయిన్ అయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు టాలీవుడ్ చందమామ కాజల్. ఈసినిమాలో కాజల్ అగర్వాల్ నటించనున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. కాగా కాజల్ అగర్వాల్, మంచు విష్ణు కలిసి మోసగాళ్లు సినిమాలో కలిసి నటించారు. మరి కాజల్ ఈసినిమాలో ఏ పాత్రలో నటిస్తుందో చూడాలి.

కాగా ఈసినిమాలో నయనతార, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్ పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాతోనే మంచు ఫ్యామిలీ థర్డ్ జనరేషన్ విష్ణు తనయుడు అవ్రామ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్‌ ఇంకా 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్