పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా… అనతికాలంలోనే తనకంటూ ఒక ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు పవన్. కథానాయకుడిగా కెరీర్ ఆరంభంలో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న పవన్… ఆ తర్వాత విజయాల పరంపరను కొనసాగించలేకపోయాడు. ఖుషి
తరువాత దాదాపు ఏడేళ్ళకి జల్సా
రూపంలో ఘనవిజయాన్ని అందుకున్న పవన్… మరో నాలుగేళ్ళ తరువాత ‘గబ్బర్‌సింగ్’ రూపంలో బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. “నాక్కొంచెం తిక్కుంది, కాని దానికో లెక్కుంది” అంటూ పవన్ సృష్టించిన ప్రభంజనంతో ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హిందీ చిత్రం ‘దబంగ్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. శృతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సుహాసిని, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరసారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. 2012 మే 11న విడుదలైన ‘గబ్బర్ సింగ్’… నేటితో 7 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
‘గబ్బర్ సింగ్’ – కొన్ని విశేషాలు:
*పవన్ కళ్యాణ్, శృతి హాసన్ కలసి నటించిన తొలి చిత్రమిదే. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ‘కాటమరాయుడు’లో మరోసారి జంటగా అలరించారు.
*పవన్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఏకైక చిత్రం ఇది.
*పవన్, నిర్మాత బండ్ల గణేష్ కలయికలో వచ్చిన రెండో చిత్రమిది. అంతకుముందు ఈ ఇద్దరి కలయికలో ‘తీన్‌మార్’ సినిమా వచ్చింది. బండ్ల గణేష్‌కు కూడా ఇదే తొలి బ్లాక్ బస్టర్ మూవీ.
*పవన్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం గబ్బర్ సింగ్
. అంతకుముందు ఈ కలయికలో ‘జల్సా’వంటి మ్యూజికల్ హిట్ రాగా… ఈ సినిమా తర్వాత ‘అత్తారింటికి దారేది’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాలు వచ్చాయి.
*పవన్‌కు ఉత్తమ నటుడిగా తొలి ఫిలింఫేర్‌ను అందించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: